<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   ప్రభు యేసు నా రక్షకా
   నొసగు కన్నులు నాకు
   నిరతము నే నిన్ను జూడ (2)
   అల్ఫయు నీవే - ఒమేగయు నీవే (2) // ప్రభు యేసు //

[V1]
 ప్రియుడైన యోహాను పత్మాసులో
 ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
 ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
 ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) // ప్రభు యేసు //

[V2]
 లెక్కలేని మార్లు పడిపోతిని
 దిక్కులేనివాడ నేనైతిని (2)
 చక్కజేసి నా నేత్రాలు దెరచి
 గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) // ప్రభు యేసు //

[V3]
 ఎరిగి యెరిగి నే చెడిపోతిని
 యేసు నీ గాయము రేపితిని (2)
 మోసపోతి నేను దృష్టి దొలగితి
 దాసుడ నన్ను జూడనిమ్ము (2) // ప్రభు యేసు //

[V4]
 ఎందరేసుని వైపు చూచెదరో
 పొందెదరు వెల్గు ముఖమున (2)
 సందియంబు లేక సంతోషించుచు
 ముందుకు పరుగెత్తెదరు (2) // ప్రభు యేసు //

[V5]
 విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
 కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
 వినయముతో నేను నీ వైపు జూచుచు
 విసుగక పరుగెత్త నేర్పు (2) // ప్రభు యేసు //

[V6]
 కంటికి కనబడని వెన్నియో
 చెవికి వినబడని వెన్నియో (2)
 హృదయ గోచరము కాని వెన్నియో
 సిద్ధపరచితివ నాకై (2) // ప్రభు యేసు //</lyrics>
<title>ప్రభు యేసు నా రక్షకా</title>
<hymn_number>211</hymn_number>
</song>